: భారత నేవీని వెన్నాడుతున్న ప్రమాదాలు... మరో సెయిలర్ మృతి
భారత నేవీని ప్రమాదాలు వీడడంలేదు. కొద్దిరోజుల క్రితం జరిగిన సింధురక్షక్ ప్రమాదాన్ని మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్ కతాలో ఈ మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కమాండర్ ర్యాంకు అధికారి ఒకరు మృతి చెందారు. ఇంజిన్ రూంలో ఉన్న ఫైర్ పైటింగ్ వ్యవస్థలో కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పేలడంతో అధికారి దుర్మరణం పాలయ్యాడు. ఐఎన్ఎస్ కోల్ కతా భారత్ సొంతంగా నిర్మిస్తున్న అత్యంత ఆధునిక యుద్ధనౌక. ప్రస్తుతం ఇది ముంబయి సముద్ర జలాల్లో ఉంది. పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ నౌక త్వరలోనే నేవీలో చేరనుంది. కాగా, ఇటీవలే జరిగిన సింధురక్షక్ ప్రమాదం నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.