: ‘అబ్బాయిగారి’ కోసం ఆ విమానం వెనక్కు వెళ్లింది..!


సామాన్యుడు అడిగితే సిటీబస్సు కూడా ఆగదు, అలాంటిది అతని కోసం విమానం వెనక్కు రావడమేమిటి అనుకుంటున్నారా? అవును మరి, అతను సగటు పౌరుడు కాదు, ఇటలీ మంత్రి గారి సుపుత్రుడు. అందుకే అతని కోసం అప్పటికే బయల్దేరిన విమానాన్ని కూడా వెనక్కి రప్పించారు. ఈ ఘటన లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో చోటు చేసుకుంది. సాధారణంగా విమానం బయల్దేరే ముందే ఎవరైనా ప్రయాణికులు రాకపోతే వాళ్ల పేర్లతో ప్రకటన చేస్తారు. మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది అలాగే చేశారు.

విమానం బయల్దేరిన తరువాత విమానాశ్రయానికి వచ్చిన ఇరాక్ రవాణా మంత్రి హది అల్ అమిరి కొడుకు మహ్మది అల్ అమిరి నానా హంగామా చేశాడు. విమానాన్ని తిరిగి రప్పించకపోతే అది బాగ్దాద్ లో దిగదని ఎయిర్ లైన్స్ మేనేజర్ ను హెచ్చరించాడు. అంతే, బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ మేనేజర్ ఆ విమానానికి క్లియరెన్స్ లేదని మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ కు ఫోన్ చేశారు. దీంతో షాక్ కు గురైన మిడిల్ ఈస్ట్ అధికారులు విమానాన్ని తిరిగి బీరుట్ కు రప్పించారు. అదీ, ఆ మంత్రి గారి కుమారుడి మజాకా!

  • Loading...

More Telugu News