: ల్యాప్ టాప్ కొట్టేసిన ప్రొఫెసర్... లింక్డిన్ ప్రొఫైల్ తో దొరికిపోయాడు!


విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ప్రొఫెసర్ తానే పెడమార్గం పట్టాడు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు వర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బెంగళూరు విమానాశ్రయంలో ల్యాప్ టాప్ కొట్టేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు. ఆ ల్యాప్ టాప్ ఓ బహుళజాతి కంపెనీలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ది. దీనిపై ఫిర్యాదు అందుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది దర్యాప్తు ఆరంభించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా, ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ను తన బ్యాగులో పెట్టుకోవడం కనిపించింది.

ఆ సమయంలో విమానమెక్కిన 120 మందిలోంచి ముగ్గురిని అనుమానితులుగా తేల్చారు. అయితే, వారి సోషల్ మీడియా ప్రొఫైళ్ళను పరిశీలించగా ఈ చోరకళా నిపుణుడైన ప్రొఫెసరే దొంగ అని తేలింది. అతడి లింక్డిన్ ప్రొఫైలే అతడిని పట్టించింది. ప్రొఫైల్ ఫోటో సీసీటీవీ ఫుటేజిలో ఉన్న వ్యక్తి ముఖంతో సరిపోలడంతో ప్రొఫెసర్ ను విచారించారు. దొంగతనాన్ని ఒప్పేసుకున్న ఆ ప్రొఫెసర్ ల్యాప్ టాప్ ను పోలీసులకు అప్పగించాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ పయనం కానున్నారు.

  • Loading...

More Telugu News