: విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడం శుభపరిణామం: హరీష్ రావు
రాష్ట్ర విభజనపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం శుభ పరిణామమని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. న్యాయస్థానాలను సాకుగా చూపించి రాజకీయాలు చేయాలనుకునే వారికి ఇది గుణపాఠమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ తెలంగాణను అడ్డుకోవాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని హరీష్ రావు అన్నారు.