: అద్వానీ నివాసంలో బీజేపీ అగ్రనేతల భేటీ


ఢిల్లీలోని అద్వానీ నివాసంలో బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, తదితరులు భేటీ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. వీరి సమక్షంలో పురంధేశ్వరి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పురంధేశ్వరి అద్వానీ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో, జాతీయ మీడియా అంతా అద్వానీ నివాసానికి చేరుకుంది.

  • Loading...

More Telugu News