: జేఎన్టీయూలో నియామకాలను నిలిపివేయాలి: కోదండరాం
హైదరాబాదు, కూకట్ పల్లిలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో నియామకాలను వెంటనే నిలిపివేయాలని టీ-జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియామకాలు చేపడితే తెలంగాణ వారికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. వర్శిటీ అధికారులు నియామకాలు చేపడితే ‘ఛలో జేఎన్టీయూ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.