: దేశీయ ఆయుధాలపైనే భారత్ మోజు
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసే దేశమేదైనా ఉందంటే అది భారతదేశమే. ప్రధానంగా రష్యా ఇప్పటిదాకా భారత్ కు ఆయుధాలను విక్రయించేది. మనకు ఆయుధ సంపత్తిని అందజేసే దేశాల్లో రష్యా తర్వాత ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికాలున్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దాదాపు 30 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఏ ఒక్క దేశానికి చెందిన ఆయుధాలను కూడా కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే దేశీయంగా యుద్ధ ట్యాంకు, తేలికపాటి పోరాట విమానం, మొబైల్ శతఘ్ని వంటి ఆయుధాలను రూపొందించి స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న భారత్ ఇకపై దేశీయ సంస్థల నుంచే ఆయుధాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మాట్లాడుతూ, పురోగామి పథంలో దూసుకెళుతున్న భారత్ ఆయుధాల కోసం ఇంకా విదేశాలపై ఆధారపడడం సంతోషదాయకం కాదని పేర్కొన్నారు.