: సైనా 'చైనా గోడ'ను దాటేనా?


భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్ళింది. ప్రీక్వార్టర్స్ లో సైనా 24-22, 18-21, 21-19తో అమెరికాకు చెందిన బీవెన్ ఝాంగ్ పై నెగ్గింది. అయితే, క్వార్టర్స్ లో సైనాకు విషమ పరీక్ష తప్పదనిపిస్తోంది. ఆ పోరులో సైనా చైనాకు చెందిన నాలుగో సీడ్ వాంగ్ షిజియాన్ ను ఎదుర్కోవాల్సి ఉంది. వాంగ్ కు సైనాపై మెరుగైన రికార్డు ఉండడంతో ఈ మ్యాచ్ లో సైనా ఎలా ఆడుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News