: పదో తరగతికి మారిన సిలబస్... వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన


పదో తరగతి విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. కొత్త సిలబస్ ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా వీటిని రూపొందించారని ఉపాధ్యాయులు వెల్లడించారు. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు దేశవ్యాప్తంగా ఒకే పాఠ్యప్రణాళిక ఉండేందుకు కృషి జరుగుతోంది. రెండేళ్లుగా తరగతుల పాఠ్యపుస్తకాల మార్పు ప్రారంభమై, ఇప్పటికి పూర్తి అయింది. 15 ఏళ్ల తర్వాత మారిన పాఠ్యపుస్తకాలు ఆకర్షణీయంగా, అందమైన రంగుల పేజీల్లో, ఛాయాచిత్రాలతో ఆకట్టుకునేలా ముద్రించారు. తెలుగు, ఆంగ్లం, గణితం, జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాల కొత్త పుస్తకాలు మండల విద్యావనరుల కేంద్రాలకు చేరాయి. వేసవి సెలవుల అనంతరం ఈ పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపుతారు.

తెలుగులో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు రచించిన ‘నేనెరిగిన బూర్గుల’ పేరిట హైదరాబాదు తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుపై వ్యాసం, శ్రీనాథుడు, బోయి భీమన్న, పరవస్తు చిన్నయసూరి తదితర కవుల రచనలు ఇందులో చేర్చినట్టు ఉపాధ్యాయలు తెలిపారు. ఉపవాచకంగా రామాయణంలో అంశాలను ఇచ్చారు. అలాగే పదవ తరగతి బోధనాంశాల్లో శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్, కళాకారిణులు సుధాచంద్రన్, హెలెన్ కిల్లర్ వ్యాసాలున్నాయి. ప్రసిద్ధ తెలుగు సినిమా మాయాబజార్ పై ప్రత్యేక పాఠాన్ని రూపొందించారు.

  • Loading...

More Telugu News