: అడ్డంకులు తొలగిపోవడంతో జూహీచావ్లా హర్షం
తాను నటించిన గులాబ్ గ్యాంగ్ (గులాబీ దళం) సినిమా విడుదలకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూహీచావ్లా సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రం తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందంటూ.. ఉత్తరప్రదేశ్ లో గులాబీ దళాన్ని ఏర్పాటు చేసిన సామాజిక ఉద్యమకారిణి సంపత్ పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ముందు స్టే విధించి తర్వాత ఎత్తివేసింది. 'ఈ చిత్రం విడుదల అవదని అనుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. విడుదల కోసం వేచి చూస్తున్నాం. మీరిక థియేటర్లకు వచ్చి చూడవచ్చు' అంటూ జూహీ చెప్పింది.