: అపాయింటెడ్ డేట్ లోపల తేల్చేద్దామని జడ్జిలు చెప్పారు: సీఎం రమేష్


రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో పిటిషన్ దార్లలో ఒకరైన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విచారణ సమయంలో ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ఇరు పక్షాలవైపు వాదించడానికి సీనియర్ న్యాయవాదులు వచ్చారని తెలిపారు. వాదనల ప్రారంభంలో ఈ కేసు చాలా సున్నితమైనదని జడ్జిలు అభిప్రాయపడ్డారని చెప్పారు. అపాయింటెడ్ డేట్ కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున... ఇప్పటికిప్పుడే స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని... కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారని తెలిపారు. అపాయింటెడ్ డేట్ లోపల కేసును ఓ కొలిక్కి తీసుకువద్దామని జడ్జిలు చెప్పినట్టు సీఎం రమేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News