: విశాఖలో ఆస్తిపన్ను వసూలుకు వినూత్న నిరసన
గ్రేటర్ విశాఖలో ఆస్తిపన్ను బకాయిల వసూలుకు కార్పొరేషన్ ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తిపన్ను మొండి బకాయిలు పేరుకుపోవడంతో వాటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా జీవీఎంసీ ఉద్యోగులు ఆస్తిపన్ను బకాయి పడ్డ అపార్ట్ మెంట్ ఎదుట ఈరోజు ఆందోళన చేపట్టారు. ఆస్తిపన్ను బకాయి మొత్తం చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు మీడియాకు తెలిపారు.