: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ వేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం ముందుకు పిటిషన్లు వచ్చాయి. అయితే, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడినని... అందువల్ల విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ రమణ కోర్టును కోరారు. దీంతో, సుప్రీంకోర్టు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.