: జగన్ తిరుమల పర్యటనపై నివేదిక సమర్పించిన టీటీడీ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల పర్యటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా దృష్టి సారించారు. వెంటనే పూర్తి స్థాయిలో నివేదిక పంపాలంటూ టీటీడీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ ఆదేశానుసారం నివేదిక తయారు చేసి ఆయనకు పంపామని టీటీడీ ఈవో గోపాల్ తెలిపారు. నివేదికను అనుసరించి గవర్నరే చర్యలు తీసుకుంటారని చెప్పారు.