: నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న పురంధేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఈ రోజు ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో ఆమె ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేపీ అగ్రనేత అద్వానీతో సమావేశమవుతారు. అనంతరం 3.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవుతారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.