: ఎంసెట్ మే 22కి వాయిదా
మే 17న జరగాల్సిన ఎంసెట్ మే 22కి వాయిదా పడింది. మే 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండడంతో, మరుసటి రోజే ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడం కష్టమవుతుందని భావించిన అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పరీక్షా కేంద్రాల అందుబాటు, ఇన్విజిలేటర్ల సేవలు, శాంతిభద్రతల పరంగా పరీక్ష వాయిదా అనివార్యమైంది. ఇతర ప్రవేశ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఎంసెట్ ను మే 22న జరపాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి నిన్న రాత్రి వెల్లడించారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ, అపరాధ రుసుముతో స్వీకరించే తేదీలు, ఫలితాల వెల్లడి తేదీ స్వల్పంగా మారే అవకాశాలున్నాయి.