: మహాత్ముణ్ణి చంపింది ఆర్ఎస్ఎస్ వాదులే: రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ వాదులే కారణమని ఆరోపించారు. అప్పుడు మహాత్ముడి చావుకు కారణమైన వారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సర్దార్ పటేల్, గాంధీజీలను వారు తీవ్రంగా వ్యతిరేకించారని రాహుల్ తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కంప్యూటర్ విప్లవాన్ని తెచ్చింది తామేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా తదితరులు భారత్ లో కంప్యూటర్లు ప్రవేశపెట్టారని రాహుల్ వివరించారు.

  • Loading...

More Telugu News