: వీడొక 'కామ' పూజారి
పవిత్రతకు మారుపేరులా వ్యవహరించాల్సిన పూజారి ఓ బాలికను అపవిత్రం చేసేందుకు యత్నించాడు. ఆగ్రా పట్టణంలోని బటేశ్వర్ ప్రాంతం వద్ద అజిత్ గోస్వామి అనే వ్యక్తి ఆలయ పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ ఆలయం వెలుపల ఓ 12 ఏళ్ళ బాలిక భక్తులకు వెలగపండ్లు విక్రయిస్తూ తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. అయితే, ఆ కాముక పూజారి కన్ను బాలికపై పడింది. మార్చి 4న ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి జనసంచారంలేని ప్రదేశానికి తీసుకెళ్ళి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకున్న బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు స్థానికులను కూడగట్టి దేవాలయం వద్దకు వెళ్ళారు. వీళ్ళ రాకను పసిగట్టిన కీచక పూజారి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.