: ఆ రోజు మాకు పవిత్ర దినం... ఎన్నికలు వద్దు: గోవా వాసులు


భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గోవాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 17న ఎన్నికల నిర్వహణ తేదీని నిర్ణయించారు. రోమన్ క్యాథలిక్కులు, ఇతర కమ్యూనిటీల వారు అధికంగా ఉండడం, గుడ్ ఫ్రైడే ముందు రోజు కావడం, దానిని పెద్ద గురువారంగా పిలవడం, ఆ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దఎత్తున ఉండడంతో ఎన్నికల తేదీని మార్చాలని గోవాలోని మానవహక్కుల సంఘం అధ్యక్షుడు పీకే మిశ్రా జాతీయ ఎన్నికల సంఘాన్ని కోరారు. గోవా వ్యాప్తంగా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. పలు రాజకీయ పార్టీలు, సంఘాలు, పలువురు ఇప్పటికే ఎన్నికల తేదీ మార్చాలని లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News