: అకస్మాత్తుగా లైవ్ నుంచి బయటికొచ్చిన న్యూస్ యాంకర్
రష్యా అధికార టీవీ చానల్ 'రష్యా టుడే' (ఆర్టీ) కు చెందిన ఓ న్యూస్ యాంకర్ అకస్మాత్తుగా లైవ్ షో నుండి బయటికొచ్చేసి అందరినీ నివ్వెరపరిచింది. ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదరు న్యూస్ యాంకర్ లిజ్ వాల్ వెల్లడించింది. రష్యా ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న చానల్ లో తాను భాగం కావడాన్ని సహించలేనని తెలిపింది. అమెరికా జాతీయురాలిని అయినందుకు గర్విస్తున్నానని పేర్కొంది. లిజ్ ఆర్టీ చానల్ లో వాషింగ్టన్ డీసీ బ్యూరోలో విధులు నిర్వర్తించింది.