: బెంగాల్ ఎన్నికల్లో సినీ, సెలబ్రిటీ గ్లామర్
సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలన్నీ సినీ గ్లామర్ నే నమ్ముకున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఈసారి సినీ నటులు పెద్ద ఎత్తున బరిలో దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున 9 మంది సినీ నటులు బరిలో దిగనుండగా, బీజేపీ తరపున ఇద్దరు బరిలో నిల్చుంటున్నారు. మూన్ మూన్ సేన్, సంధ్యారాయ్, బెంగాలీ సూపర్ స్టార్ దేవ్, డార్జిలింగ్ నుంచి ఫుట్ బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా, ప్రసూన్ బెనర్జీ, గాయకులు ఇంద్రనీల్, సుమిత్రారాయ్, సుభాష్ చంద్రబోస్ మునిమనవడు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుగట బోస్ తృణమూల్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. బీజేపీ తరపున ప్రముఖ మ్యాజిక్ మాంత్రికుడు పీసీ సర్కార్, నటుడు జార్జి బెకర్ పోటీ పడుతుండగా, బప్పీలహరి కూడా బరిలో నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.