: మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ సాధించుకున్నా: కేసీఆర్
మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అనేకమంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారని చెప్పారు. ఆర్డీయస్ ప్రాజెక్టు కోసం ఆనాడు పాదయాత్ర చేశానని గద్వాల్ బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. ఆర్డీఎస్ లో జరిగిన మోసంపై శాసనసభలో చంద్రబాబును నిలదీశానన్నారు. 12 ఏళ్లు దాటినా జూరాలకు నీరు ఇచ్చే దిక్కు లేదని, జూరాల కింద తమకు రావాల్సిన నీరు ఎలా రాదో తాను చూస్తానన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు నీరు రావాలన్న కేసీఆర్, పాలమూరు పచ్చబడేదాకా తాను నిద్రపోనని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల అసెంబ్లీ సీటుకు టీఆర్ఎస్ తరపున కృష్ణ మోహన్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వాల్మీకి బోయదొరల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని సభాముఖంగా చెప్పారు.