: పవన్ కల్యాణ్ కొత్త పార్టీ.. అభ్యర్థులు ఖరారు?
పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెట్టడం ఇంచుమించు ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ మల్కాజిగిరి నుంచి లేదా కాకినాడ నుంచి బరిలో దిగనున్నట్టు సమాచారం. పవన్ పార్టీ నుంచి 9 లోక్ సభ స్థానాలకు, 40 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలను ఈ నెల 9న పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించనున్నారు. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలను, అనుభవాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఆ రోజు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారు.