: అధికారులు ఫైళ్లను ఇళ్లకు తీసుకెళ్లకూడదు: కమల్ నాథన్ కమిటీ
ఉద్యోగుల పంపకాలపై ఢిల్లీ నుంచి వచ్చిన స్వామినాథన్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయింది. సీఎస్ తో ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోకి అనుమతి లేని వ్యక్తులు రాకూడదని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో అధికారులెవరూ తమ దస్త్రాలను ఇళ్లకు తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు.