: కనుచూపు మేరలో లేని భారత వర్శిటీలు
ప్రపంచస్థాయి ప్రమాణాలకు మన విశ్వవిద్యాలయాలు ఇంకా ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రపంచ టాప్-100 వర్శిటీల జాబితాలో భారత్ కు చెందిన ఒక్క యూనివర్శిటీ కూడా చోటు దక్కించుకోలేకపోవడం అందుకు ఉదాహరణ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మాగజైన్ తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో ఎప్పటిలాగే హార్వర్డ్ యూనివర్శిటీ అగ్రపీఠం అలంకరించింది. తర్వాతి స్థానాల్లో వరసగా మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిలిచాయి. కాగా, టాప్-50లో చైనాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకోవడం విశేషం.