: గుర్గావ్ లో ప్రసవించిన ఆఫ్ఘన్ అధ్యక్షుడి భార్య
ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ భార్య గుర్గావ్ లోని 'ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' ఆసుపత్రిలో ఈ రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, ఉదయం 9.30 గంటలకు ప్రసవం జరిగిందని భారత్ లోని ఆఫ్ఘన్ రాయబారి షైదా మహ్మద్ అబ్దాలీ తెలిపారు. ఈ మధ్యాహ్నం కోలంబో వెళ్లే ముందు అధ్యక్షుడు కర్జాయ్ వచ్చి భార్య, కుమార్తెను చూసి వెళ్లినట్లు చెప్పారు. ఆ కొద్దిసేపు తమ చిన్నారి పాపతో వారు ఎంతో ఆనందంగా గడిపినట్లు వివరించారు.
కాగా, కర్జాయ్ కు అంతకుముందు ఉన్న ఇద్దరు కూతుర్లు ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టారని, కొన్ని ఊహాజనితమైన వైద్య సమస్యలవల్ల ఈసారి డెలివరీకి భారత్ వెళ్లాలని ఆఫ్ఘన్ లోని ప్రత్యేక వైద్యుడొకరు సలహా ఇచ్చారని వెల్లడించారు. ఇక్కడయితే ప్రత్యేక వైద్య సదుపాయాలు, సిబ్బంది ఉంటారని చెప్పారని అందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. చాలా మంచి సర్వీస్ అందించారని, అంతేగాక, తమకు ఈ విషయంలో మద్దతిచ్చిన భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.