: మహిళా ప్రయాణికుల పాలిట యమకూపం... ఢిల్లీ


దేశ రాజధాని ఢిల్లీ మహిళా ప్రయాణికుల పాలిట అత్యంత అరక్షిత నగరమని ఓ సర్వే చెబుతోంది. దేశవ్యాప్తంగా పది నగరాల్లో సర్వే నిర్వహించగా, 95 శాతం మంది ఢిల్లీని అత్యంత ప్రమాదకర నగరంగా పేర్కొన్నారు. గతేడాది కూడా ఢిల్లీనే ఈ చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఢిల్లీ తర్వాతి స్థానంలో కోల్ కతా, జైపూర్ నగరాలున్నాయి. ఇక, మహిళా ప్రయాణికులకు అత్యంత భద్రత ఉన్న నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. గతేడాది సురక్షిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఈసారి ఐదోస్థానానికి పడిపోయింది. కాగా, మహిళల్లో కేవలం 16 శాతం మాత్రమే సేఫ్టీ యాప్స్ ను ఉపయోగిస్తున్నారట.

  • Loading...

More Telugu News