: గాలి పార్టీతో పొత్తుకు నేను వ్యతిరేకం: సుష్మాస్వరాజ్


కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బీఎస్ఆర్ పార్టీతో పొత్తు లేదా విలీనం వద్దని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. బీఎస్ఆర్ పార్టీ బీజేపీలో కలుస్తుందన్న విషయంపై ఆమె తీవ్రంగా స్పందించారు. బళ్లారి మైనింగ్ వివాదంలో ఉన్న బీఎస్ఆర్ పార్టీతో కలిసేందుకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. హర్యానాలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న హర్యానా జనహిత్ కాంగ్రెస్ (హెచ్ జేసీ)లో సీనియర్ కాంగ్రెస్ నేత వినోద్ శర్మ చేరడాన్ని కూడా ఆమె ఖండించారు. దీనిపై ఆ పార్టీ అధినేత కులదీప్ బిష్ణోయ్ కి తన అభిప్రాయం చెబుతానని అన్నారు. వినోద్ శర్మ కొడుకు మనుశర్మ మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో నిందితుడు.

  • Loading...

More Telugu News