: వారికే మోడీ 'వికాసపురుషుడు': కేజ్రీవాల్


ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం నరేంద్ర మోడీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అదానీలు, అంబానీలకే మోడీ 'వికాసపురుషుడు' (అభివృద్ధి సృష్టికర్త) అని ఎద్దేవా చేశారు. కచ్ ప్రాంతంలోని ముంద్రా తాలూకాలో రైతులతో సమావేశమైన సందర్భంగా కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'గుజరాత్ లో అభివృద్ధి తీవ్రస్థాయిలో జరిగిందని ఆయన (మోడీ) మీడియా సాయంతో చెప్పుకుంటున్నారు. రైతుల భూములు కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. దీన్ని బట్టి చూస్తుంటే గుజరాత్ లో మొత్తం భూమి అమ్మకానికి పెట్టినట్టున్నారు' అని ఆరోపించారు. మోడీ ప్రోత్సహిస్తున్న బడా కంపెనీలు పెద్ద ఎత్తున నల్ల డబ్బు పోగు చేసుకుని ఉన్నాయని, ఏదో ఒకనాడు అవి స్విట్జర్లాండ్ ఎగిరిపోతాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News