: సస్పెండ్ అయిన కాశ్మీర్ విద్యార్థులపై దేశద్రోహ నేరం


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న స్వామి వివేకానంద సుభర్తి విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 67మంది కాశ్మీర్ విద్యార్థులు... ఇటీవలి వన్డే మ్యాచ్ లో భారత్ పై పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకుని, పాక్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సస్పెండ్ అయిన సంగతి తెలిసింది. తాజాగా వారిపై దేశద్రోహ నేరం మోపారు. అటు ఈ వ్యవహారంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులపై దేశద్రోహ నేరం ఆరోపణలు మోపటం అంగీకరించలేని కఠినమైన శిక్ష అని అన్నారు. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. సదరు విశ్వవిద్యాలయం ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమని, యూపీ ప్రభుత్వం పునఃసమీక్షిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News