: తెలంగాణలో కార్పొరేట్ శక్తుల ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి: కోదండరాం
శతాబ్దాల పాటు వలస పాలనలో ఉన్న తెలంగాణను ఆదుకోవాల్సింది పోయి... కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్యాకేజీలు, ప్రత్యేక హోదాలు కల్పిస్తోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం విమర్శించారు. ఈ రోజు హైదరాబాదులోని సుందరయ్య కళా నిలయంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలంగాణ పునర్నిర్మాణం- ప్రజల పాత్ర' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జేఏసీ ఇప్పటిదాకా ఒక మైలు మాత్రమే ప్రయాణించిందని... మరో 99 మైళ్లు ప్రయాణించాల్సి ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ.... కార్పొరేట్ శక్తుల ఆగడాలు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయని చెప్పారు.