: అశ్విన్ తో కాదు, నాకు నేనే పోటీ: హర్భజన్
దాదాపు తెరమరుగైన ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ మళ్ళీ రేసులోకొచ్చాడు! టీమిండియా ప్రధాన స్పిన్నర్ గా వెలుగొందుతున్న రవిచంద్రన్ అశ్విన్ విదేశీ పిచ్ లపై విఫలమవుతుండడంతో భజ్జీని జట్టులోకి తీసుకోవాలనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హర్భజన్ మాట్లాడుతూ, జట్టులో ఎంపికకు తాను అశ్విన్ ను పోటీగా భావించడంలేదని చెప్పాడు. 'ఇన్నేళ్ళ క్రికెట్ ప్రస్థానంలో నాకు ఒక్కరితోనే పోటీ... అది నేనే. ఎప్పుడూ ఎవరినీ పోటీదారుగా భావించలేదు' అని తెలిపాడు. టీమిండియాకు ఆడగలిగే సత్తా ఇంకా తనలో మిగిలే ఉందని వెల్లడించాడు. ఆస్వాదించగలిగినంతకాలం క్రికెట్లో కొనసాగుతానని ఈ సర్దార్జీ చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ళ వయసు వచ్చినా ప్రతిభ ఉంటే ఆ క్రికెటర్ ను ఎవరూ ఆపలేరని, వయసు ఆటకు అడ్డంకి కాబోదని వివరించాడు.