: ఓటు హక్కే ఆయుధం...సమర్థుడైన నేతను ఎన్నుకోవాలి: మాజీ కీపర్
యువత చేతిలో ఓటు హక్కు ఓ ఆయుధమని టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఎమ్ఎస్ కే ప్రసాద్ తెలిపారు. విజయవాడ శారదా కళాశాలలో సురాజ్య ఉద్యమ ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఓటు హక్కు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని అన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాల్సిన బాధ్యత యువతపై ఉందని... విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన యువతకు సూచించారు.