: యూరోప్ లో మహిళల పరిస్థితి మరీ దారుణం
మన దగ్గర అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కలవరపడుతున్నాం. కానీ, ఈ విషయంలో మన దగ్గర కంటే యూరోప్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ప్రతీ పది మంది మహిళలలో ఒకరు లైంగిక హింసకు గురవుతున్నారని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి సర్వేనే వెల్లడించింది. వీరిలోనూ సగం మంది అత్యాచార బాధితులేనని పేర్కొంది. యూరోప్ యూనియన్ దేశాల్లో ప్రతీ రోజూ 10 కోట్ల మంది మహిళలపై లైంగిక వేధింపులు కొసాగుతున్నాయట. మొత్తం 42వేల మంది మహిళలపై సర్వే నిర్వహించి ఈ ఫలితాలను మదింపు వేశారు.