: ఫోన్ కొట్టు... నిమిషాల్లో సిలిండర్ పట్టు
వంటచేస్తున్నారు... ఉన్నట్లుండి సిలిండర్ లో గ్యాస్ అయిపోయింది. ఏంటి పరిస్థితి? డీలర్ వరకు వెళ్లాలి. అక్కడ వారి దయా దాక్షిణ్యంపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు మినీ సిలిండర్ కోసం ఆర్డర్ చేస్తే సరి. పిజ్జాలా.. వేగంగా సిలిండర్ ను తీసుకొచ్చి ఇచ్చేసి వెళతారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్లు వాడే వారికి ఇలాంటి సత్వర డెలివరీ సౌకర్యాన్ని ఢిల్లీ, హైదారాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఆయిల్ కంపెనీలు ప్రారంభించాయి. 1,000 రూపాయలతో కనెక్షన్ తీసుకుంటే చాలు. సిలిండర్ ధర 543 రూపాయలు. దీనిపై సబ్సిడీ ఉండదు. 1800 22 4344 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాల్సి ఉంటుంది. అన్ని నగరాలకు ఇదే నంబర్ ను కేటాయించారు.