: స్టీల్ కంటే ఐదు రెట్లు దృఢమైన సాలీడు దారం
స్టీలే ఎంతో దృఢంగా ఉంటుంది. అయితే, దానికంటే ఐదురెట్లు ఎక్కువ దృఢమైన దారం రాబోతోంది! అలాంటి సింథటిక్ సాలీడు దారం తయారీ కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ దారం స్పైడర్ మ్యాన్-2లో వలే.. నడుస్తున్న రైలును ఆపగలిగేంత గట్టిగా ఉంటుందని ఉతా స్టేట్ యూనివర్సిటీలో బయోలాజికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాండే లూయిస్ చెబుతున్నారు. ఈ మెటీరియల్ ను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మెడికల్ ఇంప్లాంట్లు తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చని అంటున్నారు.