: వరుస పరాజయాల ఫలితం...
టీమిండియా ఇటీవల నమోదు చేసిన టెస్టు పరాజయాల ఫలితంతో ర్యాంకింగ్స్ లో కిందకు పడిపోయింది. నిన్నటి దాకా ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన భారత్ ఇప్పుడు ఓ స్థానం పతనమైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియన్లు ధోనీ సేనను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ విధానం ప్రకారం (ఏప్రిల్ 1 కటాఫ్ డేట్ అనుసరించి) మూడోస్థానంలో ఉన్న భారత్ కు రూ. 1.63 కోట్లు, రెండో స్థానంలో ఉన్న ఆసీస్ కు రూ.2.27 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కు రూ.98 లక్షలు దక్కుతాయి. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రపీఠం అలంకరించిన దక్షిణాఫ్రికా రూ. 2.92 కోట్లు అందుకోనుంది.