: ఆశల పల్లకిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం
హైదరాబాదులో గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న స్థిరాస్తి వ్యాపారం మళ్ళీ రెక్కలు రెపరెపలాడిస్తోంది. తెలంగాణ అంశం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ మూడు ప్లాట్లు, ఆరు అపార్ట్ మెంట్ల తరహాలో దూసుకెళుతుందని కన్సల్టెన్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ వస్తుందో? రాదో?, వస్తే ఇక్కడి భూముల పరిస్థితి ఏంటి? అన్న అనిశ్చితి కారణంగా గతేడాది స్థల విక్రయాల్లో 4 శాతం తరుగుదుల చోటు చేసుకుంది. దేశంలోని ఇతర రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోల్చితే హైదరాబాద్ పరిస్థితి క్రమేణా దిగజారిందని నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ తెలిపింది.
ఉద్యమం నేపథ్యంలో పరిశ్రమలు వెనక్కి మరలడం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, అధిక ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత వంటి కారణాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుంగదీశాయని 'నైట్ ఫ్రాంక్' పేర్కొంది. ఇప్పుడిక తెలంగాణపై స్పష్టత రావడంతో ఈ ఏడాది చివరి నాటికి స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుందని వివరించింది.