: ఆల్ ఖైదా పాకిస్థాన్ లోనే ఉంది: పెంటగాన్


అమెరికాను వణికించిన ఆల్ ఖైదా ఇంకా ఉనికిలో ఉందా? లేక లాడెన్ హత్య అనంతరం తుడుచుపెట్టుకుపోయిందా? ఉంటే ఎక్కడ ఉంది? ఎలా పని చేస్తోంది? అనే అనుమానం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో బలంగా ఉంది. దీనికి సమాధానం పెంటగాన్ (అమెరికా రక్షణ వ్యవహారాల కేంద్రం) ఇచ్చింది. ఒసామా బిన్ లాడెన్ నాయకత్వం వహించిన ఆల్ ఖైదా పుట్టిల్లు పాకిస్థాన్ లోనే ఉందని, అక్కడి నుంచే భేషుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని పెంటగాన్ వెల్లడించింది. పాక్ లోని గిరిజన ప్రాంతాలతో పాటు, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా దీని ఉనికి ఉందని, ఈ రెండు దేశాల్లో దీనిపై ఒత్తిడి ఉండడంతో సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషిస్తోందని తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ పెద్దగా కృషి చేయలేదని పెంటగాన్ వెల్లడించింది. పాక్, భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ రెండు దేశాలు నియంత్రణరేఖ వద్ద భారీ స్థాయిలో బలగాలను మోహరించాయని పెంటగాన్ వివరించింది.

  • Loading...

More Telugu News