: విభజన వ్యతిరేక పిటిషన్లపై రేపు సుప్రీంలో విచారణ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్ట రూపం దాల్చిన తరువాత దాఖలయిన పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నట్లు న్యాయవాది రమేశ్ తెలిపారు. దాదాపు 12కు పైగా పిటిషన్లు వచ్చినట్లు సమాచారం. వాటిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీలు సబ్బంహరి, రాయపాటి, ఉండవల్లి తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లు ఉన్నాయి.