: కిరణ్ పార్టీ ప్రకటన నేడే... సర్వత్ర ఉత్కంఠ!


పోలింగ్ తేదీకి మరో 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. రాష్ట్ర విభజన జరిగేంత వరకు సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు తన పార్టీని ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, అజెండా ఖరారయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సాయంత్రం 4 గంటలకు కిరణ్ తన సన్నిహితులతో హైదరాబాద్ మాదాపూర్ లో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మీడియా సమక్షంలో తాను పెట్టబోయే కొత్త పార్టీని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. గతంలోనే రిజిష్టర్ చేయించిన కొత్త పార్టీని ఆయన ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ వెంట ఎవరెవరు వస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News