: ఎంఎంటీఎస్ రైలులో దత్తాత్రేయ ప్రచారం


బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాదులో కాచిగూడ నుంచి హైటెక్ సిటీ వరకు నమో (నరేంద్ర మోడీ) యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంలో ఆయన ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణించి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే రైళ్లలో మహిళల భద్రత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా, ఎంఎంటీఎస్ రైలు రెండో దశను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News