: 'సామాజిక తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధే నా ధ్యేయం'
విభజన అనంతరం రెండు రాష్ట్రాలు అనివార్యమైన నేపథ్యంలో సామాజిక తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి తన ధ్యేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులో జరుగుతున్న టీడీపీ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఎన్టీఆర్ ఢిల్లీని గజగజలాడించారని పేర్కొన్నారు. అదే వైఎస్సార్సీపీకి ఓటేస్తే ఆ పార్టీ నేతలు ప్రధానిని కూడా నిలదీయలేరని ఎద్దేవా చేశారు. సైకో జగన్ పార్టీకి ఓటేస్తే అంతే సంగతులని బాబు వ్యాఖ్యానించారు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ ప్రజలను మోసగిస్తారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఉండే జిల్లా అని అభివర్ణించారు. ఈ జిల్లాకు ఉన్న వనరులు ఎక్కడా లేవని చెప్పారు. ఇక్కడికి కొన్ని పరిశ్రమలు రాకుండా కొందరు అడ్డుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. తాము కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే ఇనుప ఖనిజాన్ని దొంగరవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.