: మొయిలీకి బెంగళూరులో అడ్రస్ కూడా లేదు: బాబు
కాంగ్రెస్ కీలక నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక మంత్రి చిదంబరం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచాడని వివరించారు. మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకి బెంగళూరులో అడ్రస్ కూడా లేదని ఎద్దేవా చేశారు. వీళ్ళు రాష్ట్ర భవితను నిర్ణయించడం పట్ల తెలుగు ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారని బాబు పేర్కొన్నారు.