: తిక్కన, మొల్ల వంటి మహనీయుల జన్మగడ్డ ఇది: బాబు


నెల్లూరులో జరుగుతున్న ప్రజాగర్జన సభలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆరంభమైంది. పౌరుషానికి ప్రతీక సింహపురి గడ్డ అని బాబు తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు. తిక్కన, మొల్ల, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు పుట్టిన పుణ్యభూమి ఇదని... బెజవాడ గోపాల్ రెడ్డి, ఆత్రేయ, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ఆణిముత్యాలు జన్మించిన గడ్డ ఇది అని కొనియాడారు. అంతకుముందు వేదికపైకి చేరుకున్న బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు శంఖం పూరించారు.

  • Loading...

More Telugu News