: ఇమ్రాన్ ఖాన్ కు విద్యార్థుల సెగ


పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై ఇంగ్లండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్శిటీకి చాన్సలర్ గా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ విధులకు దూరంగా ఉండడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 2010 నుంచి విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్, ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరు కాలేదని, అలాంటప్పుడు చాన్సలర్ పదవి ఎందుకుని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు కావాలో, వర్శిటీ పదవి కావాలో తేల్చుకోవాలని వారు ఇమ్రాన్ కు అల్టిమేటం విధించారు. అంతేగాకుండా ఇమ్రాన్ ను తొలగించేందుకు వీలుగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కూడా వర్శిటీ విద్యార్థి సంఘం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News