: పార్టీలో చంద్రబాబు నాకన్నా జూనియర్: అయ్యన్నపాత్రుడు


సీనియర్ రాజకీయవేత్త అయ్యన్నపాత్రుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. పార్టీలో తనకన్నా చంద్రబాబు జూనియర్ అని, కానీ, తనకు సముచిత స్థానం కల్పించలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో అవినీతి పరులకు చోటులేదని పేర్కొన్నారు. తనకు టికెట్ ఇవ్వకున్నా టీడీపీలోనే కొనసాగుతానని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అవినీతిపరులు తెలుగుదేశం పార్టీలోకి రాకుండా పోరాడతానని, ఆ విషయంలో చంద్రబాబునైనా ప్రశ్నిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News