: టీడీపీ ప్రజాగర్జనలో జూనియర్ ఎన్టీఆర్ పాట
నెల్లూరులో జరుగుతున్న టీడీపీ ప్రజాగర్జన సభ సందర్భంగా ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా సింహాద్రిలోని పాటను ప్యారడీ చేస్తూ కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ పాటను టీడీపీ వేదికపై ప్రదర్శించడం ఆసక్తి కలిగిస్తోంది.