: గెలుపుబాటలో కోహ్లీ గ్యాంగ్
ఆసియా కప్ లో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్న టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. పసికూన ఆఫ్ఘన్ విసిరిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 23.3 ఓవర్లు ముగిసేసరికి రహానే (56) వికెట్ కోల్పోయి 121 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ధావన్ 60 పరుగులతో, రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) పరుగులేమీ చేయకుండానూ క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 26.3 ఓవర్లలో 39 పరుగులు చేస్తే చాలు. చేతిలో 9 వికెట్లున్నాయి.