: షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ముందు ప్రకటించినట్టుగానే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని మిట్టల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులు మూసేయించాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 30న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News